
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్. అనంతరం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వోడితల ప్రణవ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు వోడితల ప్రణవ్.
6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని, మండలంలోని పలు గ్రామాల బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వోడితల ప్రణవ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేదలు,ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, ఆరు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు మేనిఫెస్టోలో పేర్కొందన్నారు.