చంద్రబాబు ఎస్కార్ట్ పై నో కాంప్రమైజ్.. కేంద్రం నిబంధనల ప్రకారం ఉండాల్సిందే! | babu zplus security| no| compromise| high| court| ap| government| advocates| center
posted on Oct 31, 2023 12:38PM
స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి విదితమే. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోనికి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి ఆయనకు నాలుగు వారాలు మథ్యంతర బెయిలు మంజూరు చేసింది.
ఈ సందర్భంగా చంద్రబాబు సెక్యూరిటిపై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఇద్దరు డీఎస్పీలను ఉంచాలని కోరారు. అయితే అందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించిన హైకోర్టు జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. కేంద్రం నిబంధనల మేరకు ఆయన భద్రత ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇలా ఉండగా స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిలుపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. భార్య బ్రాహ్మణితో కలిసి ఆయన రాజమహేంద్రవరం చేరుకున్నారు.