
ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఈజీ విక్టరీ పొందింది. పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే పాకిస్తాన్ ఈ విజయం తర్వాత.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. మరోవైపు పాక్ ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.
Jammu Kashmir: కశ్మీర్‌లో 3 రోజుల్లో మూడో దాడి.. పోలీసును కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఈ మ్యా్చ్లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్ చేసిన పాక్.. 45.1 ఓవర్లలో 204 పరుగులకే బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేసింది. బంగ్లా తరుఫున మహ్మదుల్లా (56) పరుగులు అత్యధికంగా చేశాడు. ఆ తర్వాత లిటన్ దాస్ 45, షకీబ్ 43, మెహిదీ హాసన్ మిరాజ్ 25 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చూపించారు. షాహీన్ అఫ్రిది మొదటి ఓవర్లోనే వికెట్ తీసి.. బంగ్లాను ఆదిలోనే గట్టిదెబ్బ కొట్టాడు. ఇక మరో బౌలర్ మహ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు తీశాడు. అఫ్రిది కూడా 3 వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ రెండు వికెట్లు తీయగా.. ఇఫ్తికార్ అహ్మద్, ఒసామా మీర్ తలో వికెట్ సాధించారు.
Janhvi Kapoor: పదహారణాల పల్లెటూరి పిల్ల.. మా ‘దేవర’ గర్ల్ ఫ్రెండ్
205 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 32.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్‌ల మధ్య తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం చేశారు. అబ్దుల్లా షఫీక్ 69 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఫఖర్ జమాన్ 74 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇక బంగ్లా బౌలర్లలో మెహందీ హసన్ మిరాజ్ 3 వికెట్లు తప్ప.. మిగతా బౌలర్లు వికెట్లు పడగొట్టలేకపోయారు. పాకిస్థాన్ 7 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు సాధించింది. పాకిస్థాన్ 3 మ్యాచ్‌లు గెలవగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఇక.. బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌కు 7 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ 6 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలుపొందింది.