Leading News Portal in Telugu

CBN: జైలు నుంచి బయటకు వస్తూనే దేవాన్ష్‌ను ముద్దాడిన చంద్రబాబు


CBN: జైలు నుంచి బయటకు వస్తూనే దేవాన్ష్‌ను ముద్దాడిన చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో 53 రోజుల జైలులో శిక్ష అనుభవించారు. ఇక, చంద్రబాబకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ని జైలు అధికారులు రిలీజ్ చేశారు. దీంతో చంద్రబాబు రిలీజ్ కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌లు చంద్రబాబుకు ఎదురెల్లి స్వాగతం పలికారు. ఇకపోతే, చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రధాన గేటు వరకు కాలి నడకన వచ్చారు. ఇక, 53 రోజుల తర్వాత తన మనవడు నారా దేవాన్ష్‌ను చూసిన చంద్రబాబు ఒక్కసారిగా ముద్దాడారు. ఆ తర్వాత భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణీ, బావమరిది నందమూరి బాలకృష్ణలతో మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఆయన కౌగిలించుకున్నారు. ఇక, చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు హారతిలిచ్చారు.

మరోవైపు, చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, నేతలు రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రధాన గేటు దగ్గరకు చేరుకుని ఆయన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, సెంట్రల్ జైలు దగ్గరికి టీడీపీ శ్రేణులు భారీగా రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కనీసం చంద్రబాబు ఎన్ఎస్‌జీ వెహికిల్స్ కూడా వెల్లలేనంతగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు మోహరించారు. జై చంద్రబాబు జైజై చంద్రబాబు అంటూ నినాదాలతో రాజమహేంద్రవరం సెంట్రల్ ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది.