
Indian Racing League: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలు వాయిదా పడడం లేదా ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగాల్సిన రెండు రేసింగ్ పోటీలు రద్దయ్యాయి. హుస్సేన్ సాగర్‌లోని నెక్లెస్ రోడ్ వేదికగా జరగాల్సిన ఎఫ్4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహణకు బ్రేక్ పడింది. చెన్నైలో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్వహించలేకపోవడంతో చెన్నైకి మార్చారు. హైదరాబాద్‌లో ఐఆర్‌ఎల్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి చెల్లించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేదిక మారినప్పటికీ, రేస్ తేదీలు అలాగే ఉండటం గమనించదగ్గ విషయం. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి వాపసు లభిస్తుంది. దీని కోసం బుకింగ్ భాగస్వామి Paytm ఇన్‌సైడర్ టిక్కెట్ హోల్డర్‌లకు ఇమెయిల్‌లను పంపుతారు.
Bigg Boss 7 Telugu: టాస్క్ లో రెచ్చిపోయిన భోలే.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అమర్ దీప్..