
Vizianagaram Train Accident: విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విజయనగరం వచ్చి వెళ్లిన తర్వాత పరిహారం విడుదల చేశారు అని తెలిపారు.. రెండు మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్న వారికి రూ.5 లక్షలు, పది రోజులు ఉన్నవారికి రూ. 2 లక్షలు.. అందజేస్తున్నాం.. ఇక, 13 మందికి రూ. 10 లక్షల చొప్పును పరిహారాన్ని ఇవ్వనున్నామని వెల్లడించారు.. 12 మందికి రూ. రెండు లక్షల చొప్పున ఇచ్చాం.. మూడు నెలల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉన్న పదిహేను మందికి రూ.75 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు.. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. వికలాంగులుగా మిగిలిపోయిన వారికి రూ.10 లక్షలు ఇస్తున్నాం.. 43 మందికి పరిహారం అందజేస్తున్నాం అన్నారు మంత్రి బొత్స.. ఎవ్వరికైన ఇబ్బంది వస్తే ఆదుకోవాలన్న అలోచనతోనే పరిహారం అందిస్తున్నాం.. ఈ పరిహారంతో వారి జీవితాలు మారిపోతాయని మేం భావించడం లేదు.. కాస్త వారికి సహాయం మాత్రమే అన్నారు. రైలు ప్రమాదంలో గాయపడున వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధితన వైద్యులను ఆదేశించినట్టు వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.