
ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్… ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. కొండపొలం, రంగరంగ వైభవంగా రెండు సినిమాలు కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అందుకే ఈ సారి హిట్ కొట్టాలని మాస్ బాట పట్టాడు. మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి ‘ఆదికేశవ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్… ఇప్పటికే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. నాగవంశీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’, త్రివిక్రమ్ ‘ఫార్చూన్ ఫోర్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు.
Gear up for a rollercoaster of action, comedy, and entertainment ~ #Aadikeshava will be arriving in theatres on NOV 24th. 🔥😎
In Cinemas #AadikeshavaOnNov24th 💥#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli @dudlyraj @vamsi84… pic.twitter.com/Lstehekg7y
— Sithara Entertainments (@SitharaEnts) November 1, 2023
ముందుగా దీపావళి కానుకగా నవంబర్ 10న ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ మరోసారి పోస్ట్ పోన్ అయింది ఆదికేశవ. ఇప్పటికే దీపావళికి చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాగే క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఉండడంతో.. ఆదికేశవను నవంబర్ 24కి వాయిదా వేశారు. అయినా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అవలేదు. వైష్ణవ తేజ్‌కు హిట్ కావాలంటే… ప్రమోషన్స్‌తో హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే… ఆదికేశవ పై బజ్ జనరేట్ అవకాశాలు తక్కువ. ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆదికేశవ టీజర్ బాగుంది. మరి ఈసారైనా ఆదికేశవ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.