Leading News Portal in Telugu

NZ vs SA: సెంచరీలతో రెచ్చిపోయిన డికాక్, డుసెన్.. దక్షిణాఫ్రికా భారీ స్కోరు


NZ vs SA: సెంచరీలతో రెచ్చిపోయిన డికాక్, డుసెన్.. దక్షిణాఫ్రికా భారీ స్కోరు

NZ vs SA: ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు డుసెన్‌(133), క్వింటన్‌ డికాక్‌(114)లు శతకాలతో చెలరేగిపోయారు. డేవిడ్‌ మిల్లర్(53) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్‌, జేమ్స్ నీషమ్‌ తలో వికెట్ తీశారు.

క్వింటన్ డికాక్ తన గత ఇన్నింగ్స్‌ల కంటే నెమ్మదిగా ఈ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 3వ స్థానంలో వచ్చిన రాస్సీ వాన్‌డర్‌ డుస్సెన్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ ప్రపంచ కప్‌లో తన నాలుగో సెంచరీని సాధించాడు. డికాక్‌ ఔటైన తర్వాత వాన్‌డర్ డుసెన్‌ తన సెంచరీని వేగవంతంగా పూర్తి చేశాడు. డేవిడ్ మిల్లర్‌ కూడా వేగంగా ఆడాడు. 30 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. దీంతో 358 పరుగులు భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా న్యూజిలాండ్‌కు అందించగలిగింది.