
KP Nagarjuna Reddy: మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ప్రారంభించారు. కొనకనమిట్ల నూతన సచివాలయ భవనం, మండలంలో నూతనంగా నాగంపల్లి నుంచి కొనకన మిట్ల గ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్డు, తువ్వపాడు గ్రామంలో నూతన సచివాలయం భవనం, గార్లదిన్నే గ్రామంలో నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్యే వుడుముల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డిలకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో పొదిలి, కొనకనమిట్ల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, జేసీయస్ కన్వీనర్‌లు, సచివాలయం కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..