
Pawan Kalyan: ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. గత వారం రోజుల నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. గత మూడు రోజులు నుంచి సంగీత్, కాక్ టైల్, హల్దీ, మెహందీ వేడుకలలో మెగా, అల్లు కుటుంబాలు సందడి చేశాయి. ఇక వరుణ్ పెళ్లి పనులు ఇటలీలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు.. అందరు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నారు కానీ, ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఏ ఒక్క ఫొటోలో కనిపించలేదు. దీంతో ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ ఫోటో.. పవన్ ఎక్కడ.. ? అంటూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేయడం మొదలుపెట్టారు. అంతేనా.. దీనిమీద మీమ్స్ వేస్తూ.. పవన్ ఫోటో కావాలి అంటూ రచ్చ స్టార్ట్ చేశారు. ట్విట్టర్ ట్రెండింగ్ లో varunluv హ్యాష్ ట్యాగ్ ఉన్నా కూడా అందులో పవన్ ఎక్కడ అనే మీమ్స్ మాత్రమే ఎక్కువ ఉండడం విశేషం.
Rambha: విజయవాడ పిల్ల.. మళ్లీ వస్తుందట.. ?
ఇక ఉదయం నుంచి ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. పవన్ కళ్యాణ్.. వరుణ్ పెళ్ళిలో కనిపించాడు. ముఖం కనిపించకపోయినా.. ఆయన బ్యాక్ ను అభిమానులు గుర్తుపట్టేశారు. వరుణ్ ను పెళ్లి కొడుకుగా తయారుచేసి తీసుకెళ్తున్న తరుణంలో క్లిక్ చేసిన ఫొటోలో నాగబాబు.. ఆయన పక్కన పవన్ దర్శనమిచ్చారు. అందరు పెళ్లిలో హడావిడిగా.. డిజైనర్ దుస్తుల్లో కనిపించగా .. కేవలం పవన్ మాత్రమే చాలా సింపుల్ గా కనిపించాడు. ఆలివ్ కలర్ టీ షర్ట్.. ఖాకీ కలర్ ప్యాంట్ లో పవన్ కనిపించాడు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం ట్విట్టర్ ను షేక్ ఆడిస్తున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. చాలు సామీ చాలు.. ఈరోజుకు ఇది చాలు అని కొందరు.. తిరుపతి వెంకన్నను చూసినప్పుడు కూడా ఇంత సంతోషపడలేదురా..అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే పవన్ ఫుల్ పిక్స్ కూడా వచ్చే అవకాశం ఉందేమో చూడాలి.