
CM YS Jagan Vizag Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీ (ఐసీఐడీ) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. విశాఖ పర్యటన కోసం కాసేపట్లో తాడేపల్లి నుంచి బయల్దేరనున్న ఆయన.. ఉదయం 8.05 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరతారు.. ఉదయం 8.50 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో మధురవాడ ఐటీ హిల్ నెంబర్.3లో ఉన్న హెలిప్యాడ్‌కి చేరుకుంటారు.. ఇక అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రుషికొండలోని రాడిషన్ బ్లూ రిసార్ట్‌కు వెళ్లనున్నారు సీఎం జగన్.. అక్కడ జరగనున్న 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్(ఐసీఐడీ) కాంగ్రెస్ ప్లీనరీ పాల్గొంటారు.. ఈ కార్యక్రమంలో ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు పాల్గొననున్న ఏపీ సీఎం.. ఆ తర్వాత రోడ్డుమార్గంలో మధురవాడ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. ప్రత్యేక విమానంలో తిరిగి గన్నవరం చేరుకుంటారు.. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.