Leading News Portal in Telugu

Salary Hike in India: గుడ్ న్యూస్.. న్యూ ఇయర్లో భారీగా జీతాల పెంపు


Salary Hike in India: గుడ్ న్యూస్.. న్యూ ఇయర్లో భారీగా జీతాల పెంపు

Salary Hike in India: భారతీయ ఉద్యోగులకు కొత్త సంవత్సరం గొప్పగా ఉండబోతుంది. ఇటీవలి ఓ నివేదిక ప్రకారం 2024లో భారతదేశంలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగబోతున్నాయి. మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కొత్త సంవత్సరంలో అత్యధిక జీతాల పెంపు భారతదేశంలోనే జరగబోతోందని కూడా నివేదికలో పేర్కొన్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. భారతదేశంలోని ఉద్యోగుల జీతం 2024లో 9.8 శాతం పెరగవచ్చు. లేబర్ మార్కెట్‌లోని కఠిన పరిస్థితులు, అధిక ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు వచ్చే ఏడాది తమ జీతం బడ్జెట్‌ను దాదాపు 10 శాతం పెంచుకోవచ్చు.

ఈ రంగాలలో గరిష్ట ప్రయోజనం
టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల ఉద్యోగులు ఎక్కువ ప్రయోజనం పొందబోతున్నారు. ఈ రంగాల్లోని ఉద్యోగుల జీతాలు 2024లో 10 శాతం పెరగవచ్చు. ప్రతిభకు డిమాండ్ స్థిరంగా ఉంటుందని ఈ రంగాల్లోని కంపెనీలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం కంటే వచ్చే ఏడాది జీతం పెరగనుంది.

ఈ ఏడాది నుంచి మరింత వృద్ధి అంచనా
ఈ సంవత్సరం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అంటే BFSI సెక్టార్‌లో జీతాల పెరుగుదల 9.8 శాతంగా ఉంది. రిటైల్ రంగంలో ఈ సంవత్సరం జీతం 9.8 శాతం చొప్పున పెరిగింది. వచ్చే ఏడాది వాటి అంచనా 10 శాతం. క్యాప్టివ్స్ సెక్టార్‌లో ఈ ఏడాది పెరిగిన 9.8 శాతంతో పోలిస్తే వచ్చే ఏడాది జీతం 9.9 శాతం పెరగవచ్చు.

ఇతర దేశాలకు వృద్ధి అంచనాలు
2024లో భారతదేశంలో ఊహించిన వేతన పెరుగుదల మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అత్యధికం. 2024 లో భారతదేశం కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్లలో వియత్నాంలో 8 శాతం చొప్పున జీతం పెంచవచ్చు. చైనాకు 6 శాతం, ఫిలిప్పీన్స్‌కు 5.7 శాతం, థాయ్‌లాండ్‌కు 5 శాతం జీతాలు పెరుగుతాయని అంచనా.