
Telangana BJP Leader Vijayashanti Tweet Goes Viral: సినిమాల్లో మాదిరి రాజకీయాల్లో ద్విపాత్రాభినయం సాధ్యపడదని, ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం అని బీజేపీ నేత, సినీనటి విజయశాంతి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోనీకి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు తనను కోరుతున్నారని పేర్కొన్నారు. రెండు అభిప్రాయాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేలు కోసమే అయినా ఎదో ఒక పార్టీ తరఫున మాత్రమే ఉండగలం అని విజయశాంతి అన్నారు.
తెలంగాణ రాజకీయాలపై బీజేపీ నేత విజయశాంతి తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని ఇంకొందరు అంటున్నారు. రెండు అభిప్రాయాలు మన తెలంగాణ మేలు కోసమే. అయితే పోలీసు లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లాంటి సినిమా తరహాలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం. హర హర మహాదేవ, జై శ్రీరామ్, జై తెలంగాణ’ అని విజయశాంతి తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ దుర్మార్గాల నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోనీకి కాంగ్రెస్ నుండి పోరాడాలి…
7 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన వ్యక్తి రాములమ్మ అని కొందరు..బీజేపీని విధాన పూర్వకంగా 1998 నుండి విశ్వసించి దక్షిణ భారతంతో పాటు మిగతా అనేక రాష్ట్రాలలో దశాబ్ధ కాలం… pic.twitter.com/7S9GdxV6d4
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 1, 2023