
ఎవరికైన వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతూ ఉంటుంది, తమిళ బ్యూటీ త్రిష మాత్రం వయసు పెరిగే కొద్దీ ఎఫోర్ట్ లెస్లీ బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. ఏజ్ తో సంబంధం లేకుండా త్రిష రోజురోజుకి అందంగా కనిపిస్తోంది. 40 ఏళ్ల వయసులో చాలా మంది హీరోయిన్స్ కెరీర్స్ కి ఎండ్ కార్డ్ పడుతుంటే త్రిష కెరీర్ మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఇటివలే పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్-త్రిష ఎదురుపడే సీన్ చూస్తే త్రిషకి నాలుగు పదుల వయసు ఉందంటే ఎవరూ నమ్మరు. వయసులో వెనక్కి అందంలో ముందుకి వెళ్తున్న త్రిష లేటెస్ట్ నటించిన మూవీ ‘లియో’. దళపతి విజయ్ తో దాదాపు దశాబ్దమున్నర తర్వాత నటించిన త్రిష… విజయ్ పక్కన సూపర్బ్ గా సెట్ అయ్యింది. ఈ కాంబినేషన్ చూడడానికే థియేటర్స్ కి వెళ్లిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. లియో సినిమాలో త్రిష స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది.
లేటెస్ట్ గా లియో సక్సస్ మీట్ లో పాల్గొన్న త్రిష పింక్ కలర్ సారీలో మెరిసిపోయింది. త్రిష తన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేసింది. ఈ ఫోటోస్ ని చూసిన సినీ అభిమానులు త్రిషకి ఇంకా వయసు అవ్వలేదు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. లియో సక్సస్ మీట్ లో దళపతి విజయ్, త్రిష గురించి మాట్లాడుతూ… “20 ఏళ్లకి హీరోయిన్ అవ్వడం ముఖ్యం కాదు… 20 ఏళ్లుగా హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉండడం గొప్ప విషయం” అంటూ మాట్లాడాడు. నిజమే ఎందుకంటే కొత్త హీరోయిన్లు రాగానే పాత హీరోయిన్ల టైమ్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో త్రిష రెండు దశాబ్దాల సినీ కెరీర్ ని సక్సస్ ఫుల్ గా రన్ చేస్తోంది అంటే గ్రేట్ అనే చెప్పాలి.
Thanks to everyone who made me feel like a “WOW”🤣✨🌹🧿#LeoSuccesMeet pic.twitter.com/Zh14f3pWz4
— Trish (@trishtrashers) November 2, 2023