
Manipur: మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిత్య ఘర్షణలతో మణిపూర్ తరుచు వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూ లో సడలింపు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. కానీ బుధవారం చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ కర్ఫ్యూని విధించారు. వివరాలలోకి వెళ్తే.. అక్టోబరు 31 వ తేదీన తెంగ్నౌపాల్ జిల్లా లోని మోరే వద్ద అనుమానిత ఉగ్రవాదులు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) చింగ్తం ఆనంద్ కుమార్ చౌదరిని కాల్చి చంపారు. అయితే ఆ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే బుధవారం గుర్తు తెలియని దుండగులు రాజ్ భవన్, ఇంఫాల్ పశ్చిమ జిల్లా లోని ముఖ్యమంత్రి కార్యాలయం సమీపం లోని ఫస్ట్ మణిపూర్ రైఫిల్స్ కాంప్లెక్స్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆ దుండగులను ఎదుర్కొనేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు.
Read also:Rahul Gandhi: దోపిడీ ఎలా ఉందో చూడటానికి నేరుగా మేడిగడ్డ వచ్చా.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం గుర్తు తెలియని దుండగులు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కావాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌న్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారని. ఈ నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు పోలీసులు గాలి లోకి పలు రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. కాగా ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. దీనితో మణిపూర్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ హోం శాఖ ఇంఫాల్ వెస్ట్ అలానే ఇంఫాల్ ఈస్ట్‌లలో కర్ఫ్యూ సడలింపును రద్దు చేసింది. ఈ రెండు జిల్లాల్లో బుధవారం నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విధించిన కర్ఫ్యూలో సడలింపు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు.కాగా ఇప్పుడు దానిని రద్దు చేశారు.