Leading News Portal in Telugu

Rohit Sharma: మా మొదటి లక్ష్యం నెరవేరింది.. ఇక ముందుంది అసలు పండగ: రోహిత్‌


Rohit Sharma: మా మొదటి లక్ష్యం నెరవేరింది.. ఇక ముందుంది అసలు పండగ: రోహిత్‌

Rohit Sharma Says Iam Very happy for officially qualified World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ 2023లో అధికారికంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ తెలిపాడు. తమ మొదటి లక్ష్యం నెరవేరిందని, ఇక సెమీస్ మరియు ఫైనల్స్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామన్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో గొప్పగా ఆడామని, భారత్ విజయాల్లో ప్రతి ఆటగాడి పాత్ర ఉందని రోహిత్ చెప్పాడు. ముంబైలో గురువారం శ్రీలంకను ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్‌ అందరికంటే ముందుగా సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

మ్యాచ్ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ… ‘అధికారికంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. మేము చెన్నైలో టోర్నీ ప్రారంభించినప్పుడు మా లక్ష్యం సెమీస్ మాత్రమే. ఇప్పుడు అది నెరవేరింది. ఇక మా లక్ష్యం ఫైనల్స్‌. మేం గెలిచిన ఏడు మ్యాచ్‌ల్లో ఆడిన విధానం బిన్నం. ప్రతి ఒక్కరూ జట్టు కోసం కృషి చేశారు. అందరూ భారత్ విజయాలలో పాలుపంచుకుంటున్నారు. స్కోర్ బోర్డుపై భారీగా పరుగులు ఉంచడం ఎప్పుడూ సవాలే. భారీ పరుగులు చేయాలనుకున్నాడు టెంప్లేట్ ఉండాలి. ఏదైనా పిచ్‌లో 350 చాలా మంచి స్కోరు. ఈ మ్యాచ్‌లో 357 పరుగులు చేశామంటే బ్యాటింగ్ యూనిట్‌కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఆపై బౌలర్లు పని పూర్తిచేశారు’ అని అన్నాడు.

‘శ్రేయస్ అయ్యర్ సత్తా ఉన్న ఆటగాడు. అతని సత్తా ఏంటో ఈ రోజు చూపించాడు. మేం కూడా ఆశించింది ఇదే. తన ముందున్న ఛాలెంజ్‌ని తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మొహ్మద్ సిరాజ్ నాణ్యమైన బౌలర్. అతను కొత్త బంతితో అద్భుతాలు చేస్తాడు. సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్‌లో బాగా ఆడాడు. కీలక సమయంలో విలువైన పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌, శ్రీలంకపై ప్రదర్శన సీమర్‌ల నాణ్యత ఏంటో తెలిపింది. ఇలాంటి బౌలింగ్ చూడటం ఆనందంగా ఉంద. వారు ఆ ప్రదర్శనను కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను. డీఆర్ఎస్ నిర్ణయాన్ని కీపర్ కేఎల్ రాహుల్‌కే వదిలేసాను. ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది. దక్షిణాఫ్రికా అసాధారణ క్రికెట్ ఆడుతోంది. మేం బాగా ఆడుతున్నాము. కోల్‌కతా ప్రజలు ఆ మ్యాచ్ ఆస్వాదించబోతున్నారు’ అని రోహిత్‌ చెప్పాడు.