Leading News Portal in Telugu

Dunki Vs Salaar: కింగ్ ఖాన్ కోసం రంగంలోకి భారీ ప్రొడక్షన్ హౌజ్… ఓవర్సీస్ మార్కెట్ సీజ్


Dunki Vs Salaar: కింగ్ ఖాన్ కోసం రంగంలోకి భారీ ప్రొడక్షన్ హౌజ్… ఓవర్సీస్ మార్కెట్ సీజ్

డిసెంబర్ 21న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఈరోజు షారుఖ్ ఖాన్ బర్త్ డే కావడంతో డంకీ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్ కుమార్ హిరాణీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ కాబట్టి డంకీ బాక్సాఫీస్ లెక్కలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉంటాయి. ఇప్పటికే 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో షారుఖ్ రెండు సార్లు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసాడు. ఇప్పుడు మూడోసారి కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి ఒక క్యాలెండర్ ఇయర్ లో మూడు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన ఏకైక ఇండియన్ హీరోగా షారుఖ్ హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు. షారుఖ్ కి బాక్సాఫీస్ దగ్గర అడ్డు లేదు అనుకుంటున్న సమయంలో డంకీకి పోటీగా ప్రభాస్-ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాని రంగంలోకి దించారు.

డిసెంబర్ 22న సలార్ సినిమా రిలీజ్ అవుతుంది అనే వార్త అఫీషియల్ గా బయటకి రాగానే… క్లాష్ ఆఫ్ టైటాన్స్ రేంజులో సోషల్ మీడియాలో హల్చల్ జరిగింది. ఎవరు వెనక్కి తగ్గుతారో, ఎవరు రిలీజ్ చేస్తారో లేక ఇద్దరు హీరోలు వెనక్కి తగ్గకుండా బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతారా అనేది చూడాలి. ఈ వార్ లో ప్రభాస్ పై చెయ్ సాధించడానికి షారుఖ్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఉన్నాడు. డంకీ సినిమాని ఓవర్సీస్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ డంకీ సినిమాని డిస్ట్రీబ్యూట్ చేయడానికి ముందుకి రావడంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. యష్ రాజ్ ఫిల్మ్స్ కి ఓవర్సీస్ లో సాలిడ్ గ్రిప్ ఉంది… పఠాన్ సినిమా కేవలం ఓవర్సీస్ లోనే 400 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది అంటే యష్ రాజ్ ఫిల్మ్స్ డంకీ సినిమాకి డిస్ట్రీబ్యూట్ చేయడం ఎంత హెల్ప్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఎంట్రీ సలార్ సినిమాని ఓవర్సీస్ లో ఎంత దెబ్బ తీస్తుందో చూడాలి.