
AP Cabinet Key Decisions: సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. 38 అంశాల అజెండాతో సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. కర్నూలు లో రెండవ నేషనల్ లా యూనివర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపుపై కేబినెట్లో చర్చించి ఆమోద ముద్ర వేశారు.. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల ఇవ్వాలనే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. పోలవరం నిర్వాసితుల ఇళ్ళ పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్ కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపు నిర్ణయానికి ర్యాటిఫై చేసింది కేబినెట్..
ఇక, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్డర్ డ్రాఫ్ట్ – 2023 కు ఆమోదం లభించింది.. రాష్ట్రంలో కుల గణన సర్వే చేపట్టాలనే ప్రతిపాదనను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సుమారు 19 వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కళ్యాణ్ మస్తు – షాది తోఫా మూడో విడత, జగనన్న విద్యా దీవెన మూడో విడత కు ఆమోదం లభించింది.. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు పచ్చజెండా ఊపారు సీఎం జగన్.. జగనన్న ఆరోగ్య సురక్ష పై స్టేటస్ రిపోర్ట్ కు ఆమోదం తెలిపింది.. ఇక, పలు పరిశ్రమలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది మంత్రిమండలి. ఇక, కాసేపట్లో మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు మంత్రులు.. కాగా, సమావేశం ముగిసిన తర్వాత సచివాలయంల నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.