
ప్రపంచకప్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 55 పరుగులకే లంక ఆలౌటైంది. ఈ మ్యాచ్లో షమీ, సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక బ్యాటర్లకు ఆసియా కప్ను మరోసారి గుర్తు చేశారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం కొందరు క్రికెట్ అభిమానులతో కెప్టెన్ రోహిత్‌శర్మ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపాడు. అంతేకాదు.. ఓ యువకుడికి రోహిత్ శర్మ తన షూ ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో రోహిత్ శర్మ.. ఓ షూను యువకుడికి ఇస్తున్నట్లు కనిపించింది. ‘‘పోస్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమం తర్వాత రోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకున్నాడు. ఎంసీఏ స్టాండ్‌లో తన షూను ఓ యువకుడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. హృదయాన్ని కదిలించింది’’ అని ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేసిన సమీర్ అ్లల్లానా పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. ఒక్క షూనే ఇచ్చాడా? అని ప్రశ్నించగా.. ‘‘రోహిత్ వెనక్కి వచ్చి రెండో షూ కూడా ఇచ్చేశాడు’’ అని బదులిచ్చాడు. మరొక నెటిజన్ ‘రోహిత్‌శర్మ నిజమైన జెంటిల్మన్.. గొప్ప కెప్టెన్’ అని కామెంట్ చేశాడు.
ఇదిలా ఉంటే టీమిండియా ఆడిన ఏడు మ్యాచుల్లోనూ గెలుపొంది.. సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక భారత్ తన తర్వాతి మ్యాచ్ సౌతాఫ్రికాతో తలపడనుంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది.
Rohit Sharma took selfies with fans post presentation ceremony and also gifted his shoe to a kid in the MCA STAND. Heartwarming gesture! #INDvSL pic.twitter.com/30PzVS64NL
— Sameer Allana (@HitmanCricket) November 2, 2023