
AFG vs NED: ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్ జట్టు.. 179 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన చూపడంతో నెదర్లాండ్స్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసింది. ఇదిలా ఉంటే.. డచ్ జట్టులో సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్ అత్యధికంగా 58 పరుగులు చేశాడు. ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ 42, కొలిన్ అకెర్మన్ 29 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ఏకంగా నలుగురు నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్ ను వారు రనౌట్ చేశారు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా తొలి బంతికే రనౌట్ అయ్యాడు. ఇక ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 3 వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా, ముజీబుర్ రెహ్మాన్ కు ఒక వికెట్ దక్కింది.