
సోమాజిగూడలోని కత్రియ హోటల్ లో నూతన మీడియా సెంటర్ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవడేకర్, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… సరిగ్గా ఒక్క నెల సమయం ఉంది.. ఇవాళ నామినేషన్ లు మొదలయ్యాయి… సరిగ్గా ఒక్క నెలలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. రాష్ట్ర రూపు రేఖలు మారబోతోందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది… BRS ఓడిపోబోతుంది… కాంగ్రెస్ మూడవ స్థానం లోకి పడిపోతుందని అన్నారు.
CEO Vikas Raj: ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే మా లక్ష్యం..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మీడియా సెంటర్ ను ప్రారంభించుకున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యంత ప్రతష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించారని… ఒక డిస్కవరీ ఛానల్ లో కూడా వచ్చే విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. వేలాది కోట్ల రూపాయలు నీళ్ళ పాలైందని… ప్రాజెక్ట్ కుంగిపోతుంటే చూస్తున్నామన్నారు. 2014లో 40 వేల కోట్ల రూపాయలతో ప్రారంభం అన్నారు.. అంతకముందు 30వేల కోట్ల రూపాయలు అన్నారు.. రిడిజైన్ పేరుతో లక్ష 30వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దాని బెనిఫిట్స్ పైన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.
Lawrence: గురువుకే గుదిబండలా మారిన లారెన్స్?
ఇంజినీర్స్ చెబుతున్న ప్రకారం నాణ్యత కరువైందని, మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాల్సి రావొచ్చని నిపుణులు చెబుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మొత్తం కరప్షన్ తో కూడిన ప్రాజెక్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందని విమర్శించారు. పిల్లర్లు కుంగిపోయిన చోట 15-20 మధ్యలో కుంగినప్పుడు… తాను కేంద్రానికి ఒక లేఖ రాశానన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చట్టాన్ని తీసుకొచ్చి ఒక అథారిటీని ప్రారంభించామని.. దీని ద్వారా దేశంలో పూర్తిగా ప్రాజెక్ట్ మైంటైనేన్స్ ఎలా ఉందో పర్యవేక్షిస్తుందని తెలిపారు. 20 అంశాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 11 అంశాలకు సంబంధించిన జవాబు ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అసలు ప్లానింగ్ సరిగ్గా లేదు, పిల్లర్లు సరిగ్గా నిర్మాణం అవ్వలేదు, అసలు పునాది కూడా సరిగ్గా లేదని… అందుకు సింగిల్ స్టోన్ వాడారని, అందుకే బ్రేక్స్ వచ్చాయని అన్నారు.
Bharateeyudu 2: భారతీయుడుకు చావే లేదు.. సేనాపతి తిరిగి వచ్చాడు
మేడిగడ్డ ప్రాజెక్ట్ ముఖ్యమైంది… అదే దెబ్బతింటే మిగితావన్ని నిరుపయోగంగా మారబోతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కి నీతి నిజాయితీ ఉంటే బ్యారేజ్ అంశంలో నైతిక బాధ్యత వహించాలని తెలిపారు. అన్ని టాలెంట్ లు ఉన్నాయి… కానీ ప్రాజెక్ట్ కట్టడంలో ఫెయిల్ అయ్యాడని మండిపడ్డారు. 80వేల పుస్తకాలు చదివాడు… అనుభవంతో కట్టాను అన్నాడు కానీ విఫలం అయ్యాడని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టాన్ని మిగిల్చిందని తెలిపారు. కుంగిపోయిన ప్రాజెక్ట్ పరిష్కారం అయ్యే వరకు ప్రాజెక్ట్ మొత్తం వినియోగించుకొలేని పరిస్థితి ఉందన్నారు. కమిటీ అడిగినా విషయాలని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాస్తుందని… బ్యారేజ్ నిర్మాణం పైన అధ్యయనాలు చెయ్యడానికి కుదరదని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాం… బీజేపీ అధికారంలోకి రాగానే మొత్తం విచారణ చేపట్టి ఎవ్వరూ బాధ్యులైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నానని కిషన్ రెడ్డి చెప్పారు.