Leading News Portal in Telugu

Botsa Satyanarayana: అన్ని అనుమతులు తీసుకునే రుషికొండపై నిర్మాణాలు..


Botsa Satyanarayana: అన్ని అనుమతులు తీసుకునే రుషికొండపై నిర్మాణాలు..

Botsa Satyanarayana: కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని రుషికొండ నిర్మాణాలు చేపట్టాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సామాజిక సమతుల్యం చేస్తూ వచ్చారని తెలిపారు.. ఆర్ధికంగా వెనుకబడిన అందరినీ అభివృద్ధి చేయాలని పనిచేస్తున్నారు.. వెనుకబడిన విజయనగరం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం.. ఇప్పటికే మెడికల్ కాలేజ్ తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 13 మంది చనిపోయారు.. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు.. బాధితులను ఆదుకునేందుకు నష్టపరిహారం కూడా వెంటనే అందజేశారని గుర్తుచేశారు.

పరిశ్రమల కోసం రాయితీలు ఇచ్చి తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి బొత్స.. అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం.. ఇక, ఋషికొండపై కట్టడాలను కోర్టులు కాదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని ప్రశ్నించారు.. కోర్టులను ఎవరూ కాదనలేరన్న ఆయన.. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని రుషికొండపై నిర్మాణాలు చేపట్టాం అన్నారు. ఇక, గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. అవినీతి జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో అవినీతి లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పాలసీ తెచ్చామని తెలిపారు మంత్రి బొత్స సత్యానారాయణ.