Leading News Portal in Telugu

NZ vs PAK: వరల్డ్ కప్లో మరో భారీ స్కోరు.. పాక్పై కివీస్ వీరబాదుడు



Nz Bat

NZ vs PAK: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టు పాకిస్తాన్పై వీరబాదుడు బాదింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ఈ వరల్డ్ కప్లో రెండో అత్యధిక స్కోరు ఇదే. కివీస్ బ్యాటింగ్లో ఓపెనర్ల మంచిగా రాణించారు. రచిన్ రవీంద్ర (108) మరో సెంచరీ నమోదు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. మరో ఓపెనర్ డెవిన్ కాన్వే 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 95 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర, విలియమ్సన్ మధ్య భారీ భాగస్వామ్యం నెలకొంది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన డేరిల్ మిచెల్ 29, మార్క్ చాప్మాన్ 39, గ్లేన్ ఫిలిప్స్ 41, మిచెల్ సాంథ్నర్ 26 పరుగులతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

Read Also: Chhattisgarh Election 2023: ఛత్తీస్‌ఘడ్‌లో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.. సునాయాసంగా మ్యాజిక్‌ ఫిగర్‌..!

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ బౌలర్లలో మహమ్మద్ వసీం 3 వికెట్లు తీశాడు. హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, హారిస్ రౌఫ్ తలో వికెట్ పడగొట్టారు. అత్యధికంగా పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 10 ఓవర్లు వేసి 90 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా సంపాదించలేదు. ఆ తర్వాత హారిస్ రౌఫ్ 10 ఓవర్లలో 85, హసన్ అలీ 82, మహ్మద్ వసీం 60, ఇఫ్తికర్ అహ్మద్ 8 ఓవర్లు వేసి 55 పరుగులు ఇచ్చారు. కివీస్ బ్యాటర్ల పరుగుల వరదను ఆపేందుకు పాకిస్తాన్ బౌలర్లు కష్టపడినప్పటికీ పరుగుల వర్షం కురిసింది.

Read Also: Kannappa: మంచు విష్ణు కోసం బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్