Leading News Portal in Telugu

Chellaboina venu: చంద్రబాబు అంటేనే అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం..


Chellaboina venu: చంద్రబాబు అంటేనే అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం..

జగన్ పేరు చెప్తేనే ఓ శక్తి వస్తుంది అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన సీఎం జగన్.. చంద్రబాబు అంటే అబద్దం…చంద్రబాబు అంటే మోసం.. అబద్ధాలకు, మోసాలకు చెక్ పెట్టిన నాయకుడు జగన్.. 3,648 కిలోమీటర్ల పాదయాత్రతో తపస్సు చేసిన నాయకుడు జగన్.. నవ రత్నాలతో ప్రతి వెనుక బడిన వర్గాలకు చెందిన వ్యక్తులు అభివృద్ధి సాధించారు అని ఆయన పేర్కొన్నారు. వెనుక బడిన వర్గాల రక్షకుడు సీఎం జగన్.. ఇంత మంది బీసీ లకు ఎస్సీలకు ఎప్పుడైనా పదవులు వచ్చాయా? అని మంత్రి చెల్లుబోయిన వేణు ప్రశ్నించారు.

ఉద్యమాలు చేసిన దక్కని రాజ్యాధికారం జగన్ తో వచ్చింది అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. జబ్బును జల్లెడ వేసి పట్టే ఆరోగ్యశ్రీ పతకం కు శ్రీకారం చుట్టారు.. వెనుక బడిన వర్గాల బంధువుగా జగన్ ఉన్నారు .. ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు.. బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారు.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలని గారడీలు చేస్తున్నాడు అని ఆయన మండిపడ్డారు. బీసీలకు, ఎస్సీలకు మాట్లాడే ధైర్యం ఇచ్చిన నాయకుడు జగన్ అని మంత్రి చెప్పుకొచ్చారు. వైసీపీ సర్కార్ పై ఎవరెన్ని కుట్రలు చేసిన 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి వస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. టీడీపీ- జనసేన పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.