Leading News Portal in Telugu

Food Vlogger: కేరళలో ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్య..


Food Vlogger: కేరళలో ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్య..

Food Vlogger: కేరళకు చెందిన ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొచ్చిలోని ఫుడ్‌ని పరిచయం చేసిన 33 ఏళ్ల రాహుల్ ఎన్ కుట్టి శనివారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రాహుల్ ‘ఈట్ కొచ్చి ఈట్’ పేరుతో కొచ్చిలోని ప్రముఖ ఫుడ్‌ని పరిచయం చేస్తుంటాడు.

శనివారం రోజున రాహుల్ తన ఇంటిలో బెడ్రూంలో ఉరివేసుకుని ఉండటాన్ని అతని తల్లిదండ్రులు, స్నేహితులు గమనించారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది తమకు సమాచారం ఇచ్చిందని వారు వెల్లడించారు. 2015 నుంచి రాహుల్ ఫుడ్ బ్లాగింగ్ లో భాగంగా వీడియోలు రూపొందిస్తున్నారు. అతనికి భార్య, రెండేళ్ల కొడుకు ఉన్నారు.

‘ఈట్ కొచ్చి ఈట్’ పేరుతో కొచ్చిలోని అండర్ రేటెడ్‌గా ఉన్న ఫుడ్ జాయింట్లను వెలుగులోకి తీసుకువచ్చారు. తినుబండారాల కోసం ప్రసిద్ధ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారంగా ఉంది. ఈ పేజీకి 4.21 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘‘ మా ప్రియమైన రాహుల్ ఎన్ కుట్టి మరణించడాన్ని మీతో పంచుకోవడానికి చాలా బాధపడ్డాము. దయచేసిన అతని కోసం ప్రార్థించండి, అతని మరణాన్ని తట్టుకునే శక్తిని కుటుంబసభ్యులకు ఇవ్వాలి’’ అని ఈట్ కొచ్చి ఈట్ అఫిషియల్ పేజీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.