Leading News Portal in Telugu

NZ vs PAK: వరుణుడు తెచ్చిన అదృష్టం.. న్యూజిలాండ్పై పాకిస్తాన్ గెలుపు


NZ vs PAK: వరుణుడు తెచ్చిన అదృష్టం.. న్యూజిలాండ్పై పాకిస్తాన్ గెలుపు

NZ vs PAK: ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాక్.. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో వర్షం రెండుసార్లు రావడంతో అంఫైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి వర్షం పడినప్పుడు ఓవర్లను 41కి కుదించగా, లక్ష్యాన్ని కూడా 342కు తగ్గించారు. ఈ క్రమంలో మరోసారి వర్షం పడుతుండటంతో పాకిస్తాన్ విజేతగా ప్రకటించారు.

అంతకుముందు న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్.. వేగంగా ఆడి స్కోరును పరుగులు పెట్టించాడు. అంతేకాకుండా.. అతను సెంచరీ కూడా సాధించాడు. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా, కేన్ విలియమ్సన్(95) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు పేలవ ప్రదర్శన చూపించారు. దాంతోపాటు పరుగులను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఈ మ్యాచ్ లో ఓ చెత్త రికార్డును నెలకొల్పారు.