Leading News Portal in Telugu

USA: ఇన్సులిన్‌తో 17 మందిని చంపిన నర్సు..


USA: ఇన్సులిన్‌తో 17 మందిని చంపిన నర్సు..

Killing Patients With Insulin: సాధారణంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లను డయాబెటిస్ వ్యాధి ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగిస్తాం. కానీ అమెరికాకు చెందిన ఓ నర్సు మాత్రం మనుషుల ప్రాణాలు తీసేందుకు ఉపయోగించింది. మోతాదుకు మించి ఇన్సులిన్ ఇవ్వడం మూలంగా 17 మంది పేషెంట్ల మరణాలకు కారణమైంది. పెన్సిల్వేనియాకు చెందిన హీథర్ ప్రెస్‌‌డీ(41) ఇన్సులిన్‌తో 19 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు ఒప్పుకుంది. ఈ ఏడాది మరో ఇద్దరి మరణాల్లో ఆమెపై ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. నర్సింగ్ హోమ్ మరణాలకు సంబంధించి ఆమెను గురువారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

మే నెలలో, హీథర్ ప్రెస్‌‌డీ అనే నర్సు తన సంరక్షణలో ఉన్న ముగ్గురు రోగులను చంపాలని భావించినట్లు అంగీకరించింది. ఆమెపై రెండు హత్యలు, ఒక హత్యాయత్నంపై అరెస్ట్ చేశారు. పెన్సిల్వేనియా అటార్నీ జనరల్ ఆఫీస్ ప్రకారం, ఈమె రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 రిహాబిటేషన్ సెంటర్లలో 19 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు అంగీకరించింది. మొత్తం మీద 17 మంది పేషెంట్లు ప్రెస్‌డీ ఆధ్వర్యంలో మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ 17 మంది ఎలా మరణించారనే కారణాల్ని గుర్తించలేకపోవయినప్పటికీ.. హత్యాయత్నం ఆరోపణలు దాఖలు చేయబడ్డాయి.

2 హత్యలు, 17 హత్యాయత్నాలు, 19 మంది ప్రాణాలను నిర్లక్ష్యం చేయడం వంటి కేసులు నమోదుయ్యాయి. మరణించిన వారు 43 నుంచి 104 ఏళ్ల వయసు ఉన్నవారే. మొత్తం 22 మంది రోగులపై ఆమె దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించబడింది. ఒక నర్సు తన రోగుల పట్ట శ్రద్ధ వహిస్తుందని నమ్ముతారు, కానీ ఉద్దేశపూర్వకంగా ఇలా హాని చేయడాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని అటార్నీ జనరల్ హెన్నీ అన్నారు.