
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సాధికార బస్సు యాత్రలో నల్ల జెండాలు ప్రదర్శించాలని పప్పుగాడు (నారా లోకేష్ ) అంటున్నారు.. గత ఐదు రోజులుగా చూస్తున్నా.. ఎవరైనా వస్తారని.. అలా వస్తే తొక్కుకుంటూ వెళ్తాం అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
వెనుక బడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీలో సుపరిపాలన జరగకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలపై ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక, 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని 175 స్థానాల్లో గెలిపించాలి.. 2024 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేసి.. టీడీపీ, జనసేన పార్టీలను బొంద పెట్టాలి అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.