Leading News Portal in Telugu

Vivek Venkataswamy : ఈ ప్రభుత్వాన్ని కొల్లగొట్టే టైం ఆసన్నమైంది


Vivek Venkataswamy : ఈ ప్రభుత్వాన్ని కొల్లగొట్టే టైం ఆసన్నమైంది

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలను నన్ను కేసీఆర్‌ తన అవసరానికి వాడుకొని వదిలి పెట్టాడని ఆరోపించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఇవాళ ఆయన మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కేసీఆర్‌ కుటుంబానికి ఒక ఏటిఎం మిషన్ లాగా ఉన్నదని, ఆ ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులతో రాష్ట్రానికి ఖర్చు పెడితే ఎంతోమంది పేదలకు ఇండ్లు వచ్చేవన్నారు. ఈ ప్రభుత్వాన్ని కొల్లగొట్టే టైం ఆసన్నమైందని, తాను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే అమాయకులైన ప్రజల మీద టిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ లాగా తప్పుడు కేసులు ఉండవన్నారు వివేక్‌ వెంకటస్వామి. ఇక్కడ బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియాకు కాంట్రాక్టింగ్ లకు పెట్టింది పేరుగా…ఒక నియంతల వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు.

ఇక నుంచి ఆయన ఆటలు సాగవు. ప్రజలు కోరుకున్నారనే అసెంబ్లీ బరిలో ఉంటున్న. కేసీఆర్ ఓదేలును, నన్ను రోడ్డు మీద పడేసిండు. ఇప్పుడు కేసీఆర్ ను ఇద్దరం కలిసి రోడ్డున పడేస్తం. గతంలో చివరి క్షణంలో టికెట్ ఇస్తా అని మోసం చేసిండు. కుటుంబ పాలనలో నాయకుల గొంతు కోయడం కొత్తదేమి కాదు. ప్రాణహిత ప్రాజెక్టు గ్రావిటీ ప్రాజెక్టు అది మా తండ్రి హాయాంలో తెచ్చారు. ఇప్పుడు కమీషన్ ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాళేశ్వరం డబ్బుల కోసమే కట్టారని నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి పూర్తిగా అవినీతిలో కురుకుపోయిండు. ముఖ్యమంత్రిని ఓడగొట్టేందుకు ఇదే కరెక్ట్ సమయం. కేసీఆర్ ఓటుకు డబ్బులిస్తే తీసుకోవాలి. అవి జనాల పైసలు. పోలీసులు ఒత్తిళ్లు తెచ్చిన, కేసులు పెట్టిన బయపడొద్దు. చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి’ వివేక్‌ కోరారు.