
గోల్నాక డివిజన్‌లో ఎమ్మెల్యే కాలేరు ఎన్నికల ప్రచార పాదయాత్ర లో జనం భారీగా పాల్గొన్నారు. అంబర్ పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. గోల్నాక డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించారు. బస్తీ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం తెలుపుతూ హుషారుగా పాల్గొని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమం మరియు జరిగిన అభివృద్ధి చాలా బావుందని సంతృప్తి వ్యక్తం చేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో అందరం కలిసి సీఎంగా కేసీఆర్ ని మూడవసారి నిలబెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ నే గెలిపించాలని కాలేరు వెంకటేష్ కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారు.. అదే అంశాన్ని ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ మహిళలకు వివరించడం జరిగింది. ఈ ప్రచారంలో మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు. మన కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే ఇప్పుడు మనకు అందుతున్నాయని తెలిపారు. మీరు మళ్లీ అంబర్పేట్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాలేరు వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.