Leading News Portal in Telugu

Gadikota Srikanth Reddy: నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రం..


Gadikota Srikanth Reddy: నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రం..

Gadikota Srikanth Reddy: అన్నమయ్య జిల్లాగా ఉన్న రాయచోటిని రద్దు చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు.. నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రంగా ఉంటుందని ప్రకటించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.. జిల్లాల పునర్విభజన మళ్లీ జరుగుతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాలలో చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారణమైనవని, వాటిని ఎవరు నమ్మవద్దని సూచించారు.. అన్నమయ్య జిల్లాగా ఉన్న రాయచోటిని రద్దు చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్న ఆయన.. రాయచోటిలో అన్నమయ్య జిల్లా కేంద్రం ఉండకూడదని కొంత మంది దురుధ్యేశ్యంతో విష ప్రచారం చేస్తున్నారు… కొంత మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రాంతాలకు వ్యతిరేకంగా మాద్యమాలు, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి నే జిల్లా కేంద్రంగానే ఉంటుందని స్పష్టం చేశారు.

రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని ఒక్క అడుగు కూడా దాటిపోకుండా చేస్తా అన్నారు శ్రీకాంత్‌ రెడ్డి.. జిల్లాల పునర్విభజన ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదంటూ కొట్టిపారేసిన ఆయన.. ఈ రోజు జరిగే కేబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై కనీసం చర్చ కానీ, అజెండా కానీ లేదని స్పష్టం చేశారు. కేవలం ఊహాజనితంగా రాసిన వార్తలుగా అవి ఉన్నాయి.. వంద, రెండు వందల సంవత్సరాలకు రాని జిల్లా కేంద్ర అవకాశాన్ని సీఎం వైఎస్‌ జగన్ మాకు కల్పించారు.. ప్రజల దీవెనలు, ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాయచోటి జిల్లా కేంద్రంగా యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.