Leading News Portal in Telugu

Breaking News: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఆత్మహత్య


Breaking News: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఆత్మహత్య

Breaking News: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లోన్ రికవరీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం కూతురితో కలిసి డ్యూటీకి వచ్చిన ఫజన్ అలీ.. తన కూతురు కళ్ల ముందే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.