Leading News Portal in Telugu

Gurdwara Remarks: గురుద్వారాలపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. బహిష్కరించిన పార్టీ..


Gurdwara Remarks: గురుద్వారాలపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. బహిష్కరించిన పార్టీ..

Gurdwara Remarks: సిక్కుల పవిత్రస్థలం గురుద్వారాలపై రాజస్థాన్ బీజేపీ నేత సందీప్ దాయామా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై సిక్కు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ నేత, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, సందీప్ దయామాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరు సందీప్ దయామాను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వెల్లడించారు.

ఇటీవల రాజస్థాన్ లోని అల్వార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సందీప్ దయామా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ ఎన్ని మసీదులు, గురుద్వారాలు నిర్మించారో చూడండి, ఇది భవిష్యత్తులో మనకు పుండుగా మారుతుంది.. అందుకే ఈ పుండును నిర్మూలించడం మా కర్తవ్యం’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.

అయితే పంజాబ్‌కి చెందిన నేతలు అయినా శాంతించలేదు. పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ మాట్లాడుతూ.. అతని వ్యాఖ్యల్ని క్షమించలేమని చెప్పగా.. అమరీందర్ సింగ్ సందీప్ దయామాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంజాబ్ బీజేపీ మహిళా విభాగం చీఫ్ జై ఇందర్ కౌర్ చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.