Leading News Portal in Telugu

Hyderabad: చివరిసారిగా మాట్లాడాలన్నాడు.. కారులో బంధించి అఘాయిత్యం చేశాడు..



Untitled 4

ప్రేమ అంటే ప్రాణం తియ్యడం కాదు. ప్రాణం పోయే వరకు ప్రేమించిన వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడం. పేమించడం అంటే ప్రేమను ఇవ్వడం.. తిరిగి ఆశించకపోవడం. కానీ ప్రస్తుతం ప్రేమ పేరుతో దారుణాలకు పాలపడుతున్నారు యువత. ప్రేమ పేరుతో ప్రాణం తీసుకుంటున్నారు. లేదా ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. చిన్ననాటి స్నేహితురాలు.. ప్రస్తుతం ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ప్రియురాలి పైన దాడి చేసి.. తాను ఆత్మహత్యా యత్నం చేసాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని డిఏఈ కాలనీకి చెందిన మెరుగు వంశీ(21) అనే యువకుడు, మౌలాలి ఎంజే కాలనీకి చెందిన యువతి చిన్నప్పటి నుండి క్లాస్ మేట్స్, ఒకే స్కూల్, ఒకే కాలేజ్, మంచి స్నేహితులు. ఆ చిన్ననాటి స్నేహం వారితో పాటు పెరిగి ప్రేమగా మారింది.

Read also:Venkatesh : తన సూపర్ హిట్ సాంగ్‌కి లారెన్స్ తో డ్యాన్స్ వేసిన వెంకీ.. ఆ జోష్ తగ్గలేదు..

గత కొంత కాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. కాగా ఏమైనదో తెలీదుగానీ.. ఇకపై తనకు దూరంగా వుండాలని.. ఇక్కడితో ప్రేమ వ్యవహారాన్ని మరిచిపోవాలని ప్రియుడికి చెప్పింది. అయితే ఒక్కసారిగా ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో వంశీ తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో సైకోలా మారిన అతడు ప్రియురాలిని చంపి తానుకూడా సూసైడ్ చేసుకోవాలని దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న (శనివారం) తన ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా ఓసారి మాట్లాడాలని చెప్పి బయటకు పిలిచాడు వంశీ. అందుకు ప్రియురాలు అంగీకరించడంతో ఇద్దరూ కలిసి డిఏఈ కాలనీకి కారులో వెళ్లారు. ఓ చోట కారు ఆపిన వంశీ వెంటతెచ్చుకున్న కత్తితీసి ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె కడుపు, మెడ భాగంలో గాయాలు అయ్యాయి.

Read also:Health Tips : రోజూ ఉదయాన్నే తులసి నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

దీనితో ఆ యువతి ప్రాణభయంతో కేకలు వేసింది. యువతి కేకలు విన్న స్థానికులు కారుచుట్టు గుమ్మిగూడారు. ఈ క్రమంలో వంశీ తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరి రక్తంతో కారంతా రక్తసిక్తం అయ్యింది. కాగా స్థానికులు కార్ అద్దాలను పగల గొట్టి ఇద్దర్ని దగ్గర లోని ఆసుపత్రికి తరలించారు. కాగా వెంటనే వైద్యం అందడంతో ఇద్దరి ప్రాణాలకు హాని తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.