
CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో స్థాయికి చేరుకున్నాయి. నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. అయితే.. అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడిపోతుంటే.. అందరికంటే ముందే బీఆర్ఎస్ ఆ పని పూర్తి చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈసారి హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతున్న బీఆర్ఎస్ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. రోజుకు మూడు సభల్లో పాల్గొంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అక్టోబరు 15న ప్రారంభమైన ఈ దండయాత్ర 17 రోజుల్లో 41 సభలుగా సాగుతోంది. అయితే.. నవంబర్ 09న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ దశ షెడ్యూల్ పూర్తి కావడంతో.. ఇప్పుడు రెండో దశ ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించారు.
రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 13 నుంచి 28 వరకు 16 రోజుల్లో మొత్తం 54 సభల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే.. ఇప్పటికే రాజశ్యామల యాగాన్ని పూర్తి చేసిన కేసీఆర్ తన సెంటిమెంట్ అయిన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు. అభ్యర్థులకు బి-ఫారాలు కూడా ఇచ్చారు. నామినేషన్లు కూడా వేస్తున్నారు. ఇక మిగిలింది ప్రచారమే. దీంతో.. ఇప్పటి వరకు నాలుగో గేర్‌లో వెళ్లిన కారు.. ఇకపై టాప్ గేర్‌లోనే ఉండనుంది. మరోవైపు ఈ నెల 25న హైదరాబాద్ లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి జంటనగరాల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. చివరగా కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో 28న ప్రచారాన్ని ముగించనున్నారు.
కేసీఆర్ రెండో దశ ప్రచార షెడ్యూల్ ఇది..
నవంబర్ 13 దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట
నవంబర్ 14 పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
నవంబర్ 15 బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్
నవంబర్ 16 ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్
నవంబర్ 17 కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల
నవంబర్ 18న చేర్యాల
నవంబర్ 19 అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి
నవంబర్ 20 మానకొండూర్, స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ
నవంబర్ 21 మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట
నవంబర్ 22 తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి
నవంబర్ 23 మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్చెరు
నవంబర్ 24 మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
నవంబర్ 25 హైదరాబాద్
నవంబర్ 26 ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
నవంబర్ 27 షాద్ నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డి
నవంబర్ 28 వరంగల్, గజ్వేల్
Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ అరెస్ట్.. అసలేమైందంటే?