Leading News Portal in Telugu

Samajika Sadhikara Bus Yatra Day 9: వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే 9.. ఈ రోజు ఏ నియోజకవర్గాల్లో అంటే..


Samajika Sadhikara Bus Yatra Day 9: వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే 9.. ఈ రోజు ఏ నియోజకవర్గాల్లో అంటే..

Samajika Sadhikara Bus Yatra Day 9: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలు 9వ రోజుకు చేరాయి.. ఒకేసారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ యాత్రలు సాగుతున్నాయి.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒకేసారి నిర్వహిస్తోన్న సామాజిక సాధికార బస్సు యాత్రల్లో రాష్ట్ర మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు పాల్గొంటున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చేకూరిన లబ్ధి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు నేతులు.. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు దిగ్విజయంగా సాగుతూ వచ్చిన ఈ యాత్రలు.. ఈ రోజు 9వ రోజుకు చేరాయి.. నేడు, గాజువాక- విశాఖపట్నం జిల్లా, కాకినాడ రూరల్ – కాకినాడ జిల్లా, మార్కాపురం – ప్రకాశం జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రలు జరగనున్నాయి..

ప్రకాశం జిల్లా మార్కాపురంలో సామాజిక, సాధికారిక బస్సు యాత్ర సాగనుండగా.. ముఖ్య అతిధులుగా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ వై విజయసాయిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ పాల్గొననున్నారు.. ఇక, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర మైనారిటీ నాయకులు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితర నేతలు హాజరుకానున్నాయి.. లాయర్లు, టీచర్స్, ఐటీ ఉద్యోగులు, బీసీ, ఎస్సీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారు. పూల సుబ్బయ్య కాలనీలో బీసీ భవన్‌కు శంకుస్థాపన చేయనున్నారు.. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఇక, నేడు కాకినాడలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది.. మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహిస్తుంది. 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 4 గంటలకు సర్పవరంలో భారీబహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు బూడి ముత్యాల నాయుడు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్‌, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మిథున్‌రెడ్డి, వైసీపీ నేతలు హాజరుకానున్నారు.

మరోవైపు.. గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు.. గాజువాక సెంటర్‌లో మధ్యాహ్నం గం. 12.30ని.లకు యాత్ర ప్రారంభం కానుంది. ఒంటి గంటకు టీఎన్‌ఆర్‌ కళ్యాణ మండపం వద్ద వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం జరగనుంది.. అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీఎన్‌ఆర్‌ కళ్యాణ మండపం నుంచి పాత గాజువాక వరకూ భారీ ర్యాలీ ఉండనుంది.. సాయంత్రం 4 గంటలకు పాత గాజువాకలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.. మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్ససత్యనారాయణతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొననున్నారు.