Leading News Portal in Telugu

RTC Bus Accident: బెజవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్‌ సహా ఇద్దరు మృతి


RTC Bus Accident: బెజవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్‌ సహా ఇద్దరు మృతి

APSRTC Bus Accident: విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.. పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ బస్టాండులో ప్లాట్‌ఫారమ్‌ మీదకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి అక్కడే మృతిచెందగా.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు.. ఉదయం సర్వ సాధారణంగా నెహ్రూ బస్టాండ్‌ రద్దీగా ఉంటుంది.. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.

ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆటోనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉంది.. ఉదయమే ఆటోనగర్‌ డిపో నుంచి బయల్దేరిన ఆ ఏసీ బస్సు.. నేరుగా నెహ్రూ బస్టాండ్‌కు వచ్చింది.. గుంటూరు ప్లాట్‌ ఫారమ్‌ దగ్గర ఆపేందుకు డ్రైవర్‌ ప్రయత్నం చేశాడు.. అయితే, బ్రేక్ ఫెయిల్ కావడంతో.. బస్సు ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లింది.. దీంతో.. ప్లాట్‌ఫారమ్‌ ఉన్న ఉన్న ఔట్ సోర్సింగ్ కండక్టర్, మరో మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడేమృతిచెందారు.. మరికొంతమంది ప్రయాణికులకు కూగా గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ప్లాట్‌ఫారమ్‌ మీదకు బస్సు దూసుకురావడంతో.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక.. భయభ్రాంతులలో పరుగులు తీశారు ప్రయాణికులు.. నెహ్రూ బస్టాండ్‌లోని 12వ నంబరు ప్లాట్ ఫారమ్‌ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.. నేరుగా బస్సు డిపో నుంచే వచ్చినా.. ఎలాంటి తనిఖీలు చేయకుండానే తీసుకొచ్చారా? అసలు ఏం జరిగింది.? అనే కోణంలో ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది.