విజయవాడలో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఎపిఎస్ ఆర్టీసీ బస్సు… ముగ్గురి దుర్మరణం | road accident in vijayawada
posted on Nov 6, 2023 11:34AM
ఎపి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఇంట్లో నుంచి బస్టాండ్ కి వచ్చి ప్లాట్ ఫాం మీద నిల్చుని తమ గమ్య స్థానం కోసం ఎదురు చూసిన పాపానికి ముగ్గురిని పొట్టన బెట్టుకుంది. ప్రయాణికుల గత గమ్యస్థానం తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లే కార్యక్రమం నిర్విగ్నంగా కొనసాగిస్తుంది జగన్ ప్రభుత్వం. సామాన్య ప్రజానికానికి భధ్రత కొరవడటంతో కనీసం రోడ్లపై రావడానికే జంకే పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం.
విజయవాడ బస్టాండ్‌లో సోమవారం ఉదయం (నవంబర్ 6) దారుణం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ సూపర్ లగ్జరీ బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్ నెంబర్ 12 దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు.. ఉన్నట్టుండి ఫ్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు చక్రాల కింద పలువురు ప్రయాణికులు పడ్డారు. ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో చిన్నారి, కండక్టర్ తోపాటు మరోకరు మరణించారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి, చిన్నారి అయాన్స్ గా గుర్తించారు.
ఎపి ప్రభుత్వానికి ఇది కొత్తేం కాదు . బాపట్ల జిల్లా కూచిపూడి-పెదపూడి మధ్య ఈ సంవత్సరం ఆగస్టు 15న దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకుంటున్న వేళ బస్సు ప్రమాదం జరిగింది. పంద్రాగస్టు వేడుకలు జరుపుకోవడానికి స్కూలుకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. . అమృతలూరు మండలం కూచిపూడిలోని స్కూల్ లో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకలు ముగిసిన తర్వాత ఇంటికి బస్సులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులున్నారు.
2021 డిసెంబర్ 16 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో బస్సు ప్రమాదానికి గురైంది. జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వాగులో బస్సు బోల్తా పడి 10మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్దకు రాగానే.. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు అంటుకున్నాయి. గాలి వేగంతో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. తెల్లవారుజామున కావడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు అందరు నిద్ర మత్తులో ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్రయాణీకుల లగేజీ పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు, ముగ్గురు బస్సు సిబ్బంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకపోవడంతో ఎపిలో యాంటీ ఇన్ క్యుంబెన్సీ పెరిగిపోతుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.