Leading News Portal in Telugu

CM KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. పైలట్ ఏం చేశాడంటే.!


CM KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. పైలట్ ఏం చేశాడంటే.!

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ లోపాన్ని గమనించి హెలికాప్టర్‌ను సురక్షితంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు చేర్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన పర్యటన ఆలస్యమైంది. అయితే సీఎం పర్యటన రద్దు చేసుకోలేదని, మరో హెలికాప్టర్ వస్తే యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ సోమవారం పర్యటించనున్నారు. మూడు జిల్లాలు, నాలుగు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు ప్రగతి ప్రతాద హాజరవుతారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అన్ని చోట్లా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ అభ్యర్థులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తాజాగా సీనియర్ నేతలంతా పార్టీలో చేరారు. కీలక సమావేశాలకు కేసీఆర్ హాజరుకావడం రాజకీయ వేడిని రాజేస్తోంది.
Virat Kohli Selfish: నిజమే.. విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫిష్! వెంకటేశ్ షాకింగ్ కామెంట్స్