Leading News Portal in Telugu

Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.6గా నమోదు


Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.6గా నమోదు

నేపాల్లో 157 మందిని బలిగొన్న భూకంపం.. ఇప్పుడు ఢిల్లీని తాకింది. సాయంత్రం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

మూడు రోజుల్లో భూకంపాలు సంభవించడం ఇది రెండోసారి. ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు తెలిపారు. నేపాల్ లో శుక్రవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ లో ఏర్పడిన ప్రకంపనలు ఇప్పుడు ఢిల్లీకి వ్యాపించాయి.