Leading News Portal in Telugu

Virat Kohli Selfish: నిజమే.. విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫిష్! వెంకటేశ్ షాకింగ్ కామెంట్స్


Virat Kohli Selfish: నిజమే.. విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫిష్! వెంకటేశ్ షాకింగ్ కామెంట్స్

Venkatesh Prasad Says Yes Virat Kohli is selfish: వన్డే ప్రపంచకప్‌ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన విరాట్.. తాజాగా దక్షిణాఫ్రికాపై శతకం బాదాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ చేసాడు. ఈ సెంచరీ అతడికి ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టినరోజు నాడు సెంచరీ చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శతకాల రికార్డును సమం చేశాడు. అయితే సెంచరీ చేసిన కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి.

బ్యాటింగ్ కష్టంగా మారిన ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై సహచరులు భారీ స్కోర్లు చేయలేకపోతున్న తరుణంలో విరాట్ సెంచరీ చేశాడు. ఎక్కువగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. విరాట్ సెంచరీతో పటిష్ట దక్షిణాఫ్రికాపై భారత్ 326 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ సెంచరీ చేసినా నెట్టింట విమర్శలు వస్తున్నాయి. చాలా నెమ్మదిగా ఆడాడని, 120 బంతుల్లో సెంచరీనా? అంటూ విమర్శిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ కఠినంగా ఉందని, దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఎలా సాగిందో చూడాలి అంటున్నా.. కొందరు మాత్రం కోహ్లీది సెల్ఫిష్ ఇన్నింగ్స్ అని, వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నాడు అని విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఘాటుగా స్పందించాడు.

విమర్శకులపై వెంకటేశ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘నిజమే విరాట్ కోహ్లీ స్వార్థపరుడు (సెల్ఫిష్ ప్లేయర్).. ఎంతలా అంటే వంద కోట్ల మంది కలను నెరవేర్చేంత సెల్ఫిష్’ అంటూ నెటిజన్లపై మండిపడ్డాడు. ‘విరాట్ కోహ్లీ వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతాడని, సెంచరీ కోసం దక్షిణాఫ్రికాపై సెల్ఫిష్ ఇన్నింగ్స్ ఆడాడనే చెత్త కామెంట్స్ వింటున్నా. నిజమే.. కోహ్లీ పెద్ద సెల్ఫిష్. వంద కోట్ల మంది కలలను నెరవేర్చే సెల్ఫిష్. భారత జట్టు కోసం ఎంతో సాధించినా.. ఇంకా ఏదో సాధించాలనుకునే సెల్ఫిష్. కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పగల స్వార్థపరుడు, తన జట్టు గెలుపు కోసం ఎప్పుడూ ప్రయత్నించేంత పెద్ద సెల్ఫిష్’ అంటూ ట్రోలర్స్‌కు ఘాటు సమాధానం ఇచ్చాడు.