Leading News Portal in Telugu

Israel Palestine Attack: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. 10వేలు దాటిన మరణాల సంఖ్య


Israel Palestine Attack: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. 10వేలు దాటిన మరణాల సంఖ్య

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెలరోజులుగా ఈ వార్ నడుస్తుంది. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు బలయ్యాయి. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ అల్ జజీరా నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. మరణాల సంఖ్య 10,022కి చేరుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

ఈ దాడుల్లో 4104 మంది చిన్నారులు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఎక్కువగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో మృతిచెందినట్లు తెలిపింది. అయితే హమాస్‌ మిలిటెంట్లు ప్రయోగించిన 500కుపైగా రాకెట్లు గాజాపై ల్యాండ్‌ అయ్యాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు హమాస్‌ మిలిటెంట్ల దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెల్‌ దేశస్తులు మరణించారు.

మరోవైపు పాలస్తీనియన్లపై దాడులను ఆపాలని అనేక దేశాలు ఇజ్రాయెల్‌ని డిమాండ్‌ చేస్తున్నాయి. అయినప్పటికీ హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేస్తుండంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.