
Kaleru Venkatesh: ఓటర్లను ఆకట్టుకునేందుకు లీడర్లు అనేక పాట్లు పడుతున్నారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలని బూత్ కమిటీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మోటివేశనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బూత్ స్థాయి నాయకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఎలా వివరించాలి అనే అంశాలను కాలేరు వెంకటేష్ తెలియజేశారు. కేసీఆర్ మాట ఇస్తే.. ఖచ్చితంగా అమలు చేస్తారన్నారని కాలేరు వెంకటేష్ అన్నారు. సౌభాగ్య లక్ష్మితో పాటు.. గ్యాస్ ధర ఎలా కొత్తగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మహిళ ఓటర్లు చాలా ముఖ్యమని.. వారికి ఇవ్వన్నీ వివరించాలని బూత్ నాయకులకు తెలిపారు.