Leading News Portal in Telugu

జగనైనా.. సజ్జలైనా ఒకటే.. కుండబద్దలు కొట్టేసిన షర్మిల.. ఏపీ ఎంట్రీ ఖాయమేనా? | sajjala or jagan both are same| sharmila| fires| ap| political| entry


posted on Nov 6, 2023 2:13PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోంచి తప్పుకుని షర్మిల కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించడంతో వైసీపీలో గాభరా మొదలైంది. మరీ ముఖ్యంగా షర్మిల తెలంగాణ ఎన్నికల బరినుంచి తప్పుకుని కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ఇవ్వడమంటే.. రానున్న ఏపీ  అసెంబ్లీ ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ తరఫున క్రియా శీలంగా వ్యవహరించడం ఖాయమన్న భావన  సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అదే భావన  వైసీపీ అగ్రనేతలు, మరీ ముఖ్యంగా జగన్ లో గాభరాకు కారణమైందన్నది పరిశీలకుల విశ్లేషణ. అదే జరిగితే.. ఇప్పటికే ఉన్న ప్రజా వ్యతిరేకతకు తోడు.. ఇంత కాలం తమ పార్టీకి  తోడుగా ఉన్నారని జగన్ భావిస్తున్న వైసీపీ అభిమానులు కూడా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిపోతారన్నదే జగన భయంగా చెబుతున్నారు. అదే  జరిగితే ఏపీలో వైసీపీ ఖాయమైపోయినట్లేనని కూడా అంటున్నారు. పార్టీలో కీలక  స్థానాలలో ఉండి.. జనగ్ తీరుతో తీవ్ర  అసంతృప్తికి గురౌతున్న సీనియర్లు సైతం కాంగ్రెస్ బాట పడతారన్నదే జగన్ భయంగా  వారు చెబుతున్నారు. 

ఈ కారణంగానే.. ఇంత కాలం  షర్మిలను పట్టించుకోని, అమెను కేసీఆర్ సర్కార్ అరెస్టు చేసి.. ఆమె కారులో ఉండగానే  పోలీసు స్టేషన్ కు తరలించినా పన్నెత్తు మాట మాట్లాడని జగన్.. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ కు మద్దతు  అనగానే తన ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జలను మీడియా ముందుకు పంపించేశారు. 

కాంగ్రెస్ పార్టీ జగన్ ను కేసులతో, అరెస్టుతో వేధించిందనీ, అటువంటి పార్టీకి  షర్మిల ఎలా మద్దతు ఇస్తారని  ప్రశ్నిస్తూ షర్మిలపై విమర్శలు గుప్పించారు. వైసీపీతో  కానీ, ఏపీతో కానీ  సంబంధం  లేకుండా  సొంత పార్టీ పెట్టుకుని తెలంగాణలో ఉంటే.. ఆమె కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం సరికాదంటూ  వ్యాఖ్యానించడం ఎంత  వరకూ సబబని వైసీపీ శ్రేణులే అంటున్నారు.  

గత ఎన్నికల సమయంలో  జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అన సోదరుడి విజయం కోసం తన శక్తికి మించి కృషి చేసిన షర్మిలను జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కూరలో కరివేపాకులా తీసి పారేసినా… మారుమాట్లాడకుండా ఏపీ వదిలి తెలంగాణ వెళ్లిన షర్మిల ఇప్పుడు రాజకీయంగా తన సొంత నిర్ణయం తీసుకుంటే కాదనడానికి జగన్ ఎవరు? ఆయన తరఫున పెదరాయుడిలా తీర్పులు చెప్పడానికి సజ్జల ఎవరని షర్మిల సూటిగానే ప్రశ్నించారు. 

మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను ఒక  రాజకీయ సంకల్పంతోనే తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని తేల్చి చెప్పారు. అయినా తన నిర్ణయాన్ని  ప్రశ్నించడానికి సజ్జల ఎవరని నిలదీశారు. 

ఏపీపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు  స్పందించే  ధైర్యం లేని సజ్జల తన రాజకీయాల గురించి ఎలా మాట్లాడతారని విమర్శించారు. తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతుంటే ఏపీలో అంధకారం  తాండవిస్తోందనీ, తెలంగాణలో రోడ్లు అద్దంలా మెరుస్తుంటే.. ఏపీలో రోడ్లు గుంతలతో అధ్వానంగా ఉన్నాయనీ తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ బహిరంగ సభలో చెబితే.. మీరేం చేస్తున్నారని నిలదీసి.. ముందు మీ రాష్ట్రం విషయం చూసుకోండని హితవు పలికారు. ఆ సందర్భంగానే ఒక విలేకరి ప్రశ్నకు బదులుగా జగన్ అయినా సజ్జల అయినా తనది ఇదే మాట అని కుండబద్దలు కొట్టేశారు.షర్మిల ఘాటుగా ఇచ్చిన ఈ రిటార్డుతోనే ఆమె తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీలో వైసీపీకి పక్కలో బల్లెంగా మారబోతున్నారని స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సరే అదలా ఉంచితే.. గతంలో ఏపీలో జగన్ ను అధికారంలోకి తీసుకురావడానికి కాలికి  బలపం కట్టుకుని తిరిగిన షర్మిల.. ఆ తరువాత ఏపీ  రాజకీయాలకు దూరం అయ్యారు. దూరం అయ్యారనే కంటే తాను ఎంతో కష్టపడి అన్న జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి దోహదపడితే..అధికార అందలం అందుకున్న తరువాత జగన్ షర్మిలను కూరలో కరివేపాకులా తీసి పారేసి ఏపీకి దూరం చేశారని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. స్వయంగా  షర్మిల కూడా పలు సందర్భాలలో అదే భావన వ్యక్తం చేశారు. సరే 2019 ఎన్నికలకు ముందు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీ వ్యాప్తంగా తిరిగిన షర్మిల.. ఆ ఎన్నికల ఫలితాల తరువాత.. జగనన్న వదిలేసిన బాణంలా మిగిలిపోయారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటిస్తూ పోటీ నుంచి తప్పుకోవడమంటే.. కొద్ది కాలం ముందు  ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ ఆమెకు ఇచ్చిన ఆఫర్ ను  ఆమె ఇప్పుడు దాదాపు  అంగీకరించేసిందనే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే జరిగితే దాని వల్ల షర్మిలకు ఒనగూరే ప్రయోజనంపక్జకన పెడితే  గన్ కు మాత్రం తేరుకోలేని, పూడ్చుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు.