Leading News Portal in Telugu

Deputy CM Narayana Swamy: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్ కూడా రాదు..


Deputy CM Narayana Swamy: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్ కూడా రాదు..

Deputy CM Narayana Swamy: సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి ఏ మాట వచ్చిన అది జీవో కింద లెక్క అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని కూడా వక్రీకరించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మూడు సెంట్లు భూములు జర్నలిస్టులకు అందిస్తున్నారని.. ప్రతి పేద బిడ్డ ఉన్నత చదువుకోవాలి అనేది జగనన్న సంకల్పమని ఆయన తెలిపారు. భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికలు పెడితే సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్ కూడా రాదన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై ఏ రెడ్డి ఆరోపణలు చేసినా నేను ఊరుకోనని, తగిన సమాధానం చెప్తానన్నారు. పురంధేశ్వరి\పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధం ఎత్తివేసిన వ్యక్తి చంద్రబాబే, మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీలు అంటున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి నా కాపులు అని కూడా అనాలని అంటున్నారని.. కానీ కాపులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాలేడని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.