
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా రూపొందిన చిత్రమే ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా దక్కింది. అయితే.. ఇటీవల ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ఫ్లెక్స్‌లోకి మ్యాడ్ సినిమా వచ్చింది. అయితే.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల దర్శకుడు అట్లీ కుమార్ రూపొందించిన బ్లాక్ బస్టర్ చిత్రం జవాన్ లో తెరపైకి వచ్చారు. ఈ బాక్సాఫీస్ సంచలనం ఇప్పుడు హిందీ, తెలుగు మరియు తమిళంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో ఉంది.
ఊహించని విధంగా.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్‌లో చేరిన తెలుగు చిత్రం మ్యాడ్, జవాన్ తమిళ, తెలుగు వెర్షన్‌లను అధిగమించి, విడుదలైనప్పటీ నుండి 2వ స్థానాన్ని పొందింది. గత రెండు రోజులుగా నెట్‌ఫ్లిక్స్ చార్ట్‌లలో ఒక చిన్న తెలుగు చిత్రం సాధించిన ఈ అద్భుతమైన విజయం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఈ జాబితాలో జవాన్ హిందీ వెర్షన్ మొదటి స్థానంలో ఆధిపత్యం కొనసాగడం గమనించదగ్గ విషయం. మ్యాడ్ రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ. కథ, కథనాలు, లాజిక్స్ గురించి ఆలోచించకుండా చూస్తే ఫుల్ టైమ్‌పాస్ అవుతుంది.