
BJP BC Atma Gourava Sabha: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోన్న బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సభ కోసం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంకు ప్రధాని మోడీ చేరుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ స్టేజీ పైకి చేరుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీసీ ఆత్మగౌరవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ప్రధాని మోదీ తోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. అంతకు ముందు హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మోడీ సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. సభకు వెళ్లే వారి కోసం 6 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.