
Deputy CM Narayana Swamy: నవరత్నాలతో ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో ఉన్నాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు వస్తున్నాయంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నా వాళ్లు అంటూ కల్లబొల్లి మాటలు చెప్పేందుకు చంద్రబాబు సిద్ధమవుతాడు అంటూ టీడీపీ అధినేతపై విరిచుకుపడ్డారు.. ఇక, బీసీలను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపుల ఓట్ల కోసం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు.. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా..? అనే చంద్రబాబు మాటలు ప్రజలు మర్చిపోరన్నారు.. చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర దేశం అంతా తెలుసు.. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మబోరని తెలిపారు. నవరత్నాలతో ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కలిసివచ్చినా.. కుయూక్తులతో వచ్చినా.. సీఎం జగన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గానే వస్తుంది.. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది.. మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డే ఉంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి..