Leading News Portal in Telugu

Allu Arjun: మంగళవారం కోసం రంగంలోకి నేషనల్ అవార్డు విన్నర్..


Allu Arjun: మంగళవారం కోసం రంగంలోకి నేషనల్ అవార్డు విన్నర్..

Allu Arjun: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ చరిత్రను తిరగరాశారు అజయ్ భూపతి. అంత బోల్డ్ కథతో అజయ్ చేసిన ప్రయోగం రికార్డులు సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో అతని పేరు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరువాత మహా సముద్రం అనే సినిమా తెరకెక్కించాడు. మొదటి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో.. రెండో సినిమా అంత డిజాస్టర్ టాక్ ను అందుకుంది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అజయ్.. తాజాగా మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాయల్ రాజ్ పుత్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్‌ 17న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమా ప్రై రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Kalki 2898AD: అదికాదయ్య.. పుట్టినరోజు అయినా ఫేస్ చూపించొచ్చు కదా

నవంబర్ 11 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఈవెంట్ కు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం.. కొత్త నటీనటులకు సపోర్ట్ గా నిలవడం బన్నీకి ఎప్పటినుంచో వస్తున్న అలవాటు. ఇక బన్నీ గెస్ట్ అనగానే ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఏం మాట్లాడతాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.