Leading News Portal in Telugu

Anchor Jhansi: అతని మృతి.. తీవ్ర విషాదంలో యాంకర్ ఝాన్సీ.. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ పోస్ట్..!


Anchor Jhansi: అతని మృతి.. తీవ్ర విషాదంలో యాంకర్ ఝాన్సీ.. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ పోస్ట్..!

Anchor Jhansi assistant died due to cardiac arrest: యాంకర్ ఝాన్సీ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తొలితరం యాంకర్లలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె అప్పట్లోనే నటిగా కూడా మారి చాలా కాలం నుంచి సినిమాల్లో కూడా తనదైన శైలిలో అలరిస్తూనే ఉంది. నిజానికి తన తోటి యాంకర్ ను వివాహం చేసుకుని కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న ఆమె ఆ తరువాత విభేదాలు రావడంతో విడాకులు కూడా తీసుకుని తన లైఫ్ తాను బతుకుతోంది. అయితే తాజాగా ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేయగా ఇప్పుడు అది హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ఝాన్సీ వద్ద పని చేసే ఒక వ్యక్తి చిన్న వయస్సులోనే కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు.

Santosham OTT Awards: రెండోసారి సంతోషం ఓటీటీ అవార్డ్స్.. గెట్ రెడీ అంటున్న సురేష్ కొండేటి

దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. శ్రీను, శీను బాబు అని నేను ముద్దుగా పిలుచుకునే నా మెయిన్ సపోర్ట్ సిస్టమ్ ఇతను. హెయిర్ స్టైలిస్ట్‌గా నా దగ్గర పని చేయడం మొదలు పెట్టి నా పర్సనల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. నా పనిని ఎప్పటికప్పుడు చాలా సమర్థవంతంగా నిర్వహించేవాడు. అతను నా ఉపశమనం, వర్క్ బ్యాలెన్స్, తెలివి అలాగే బలం. అతను చాలా సున్నితమైనవాడు, నిజమైనవాడు, దయగలవాడు, చమత్కారమైన హాస్యం కలిగి ఉంటాడు. అతను నా స్టాఫ్ కంటే ఎక్కువ, అతను నాకు తమ్ముడు లాంటి వాడు. 35 సంవత్సరాల వయసులో భారీ కార్డియాక్ అరెస్ట్‌తో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. నేను చాలా బాధలో ఉన్నాను, మాటలు రావడం లేదు. జీవితం ఒక నీటి బుడగ లాంటిది అని అంటూ ఆమె రాసుకొచ్చారు.